Skip to main content

Posts

4.15 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం సంయుక్త పాలనాధికారిణి వనజాదేవి పెద్దపల్లి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లాలో వరి ధాన్యం సేకరణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని సంయుక్త పాలనాధికారిణి వనజాదేవి పేర్కొన్నారు. ఈ ఏడాది 4.15 లక్షల మెట్రిక్‌ టన్నుల లక్ష్యంగా నిర్ణయించినట్లు వెల్లడించారు. వానాకాలంలో వరి ధాన్యం సేకరణపై పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ అకున్‌ సబర్వాల్‌ నిర్వహించిన దూరదృశ్య మాధ్యమంలో పాల్గొన్నారు. అనంతరం సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 45 మంది వ్యవసాయ విస్తరణ అధికారులను క్లస్టర్లుగా విభజించి నియమించామన్నారు. రైతులకు మద్దతు ధర చెల్లించేందుకు కొనుగోలు కేంద్రాలు నెలకొల్పుతున్నామని తెలిపారు. కోతలు ప్రారంభం నుంచే కేంద్రాలను ప్రారంభించాలన్నారు. సహకార, ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ ప్రవీణ్‌, పౌరసరఫరాలశాఖ అధికారి వెంకటేశ్‌ పాల్గొన్నారు. 
Recent posts
అంజన్నను దర్శించుకున్న విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి మల్యాల, న్యూస్‌టుడే: విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్రస్వామి గురువారం కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆంజనేయస్వామిని దర్శించుకొన్న అనంతరం ఆలయ ఫౌండర్‌ ట్రస్టీ ఛైర్మన్‌ మారుతితోపాటు సిబ్బందిని ఆశీర్వదించారు. 
గోదావరిలో యువకుడి మృతదేహం గుర్తింపు గోదావరిఖని, న్యూస్‌టుడే: గోదావరిఖని సమీపంలోని గోదావరిలో గల్లంతైన యువకుడి మృతదేహాన్ని గురువారం గుర్తించారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌ కృష్ణాకాలనీకి చెందిన పుల్ల సురేందర్‌(26) మంగళవారం గోదావరి నది వద్ద ద్విచక్రవాహనం, చరవాణితో పాటు దుస్తులు వదిలి కనిపించకుండా పోయాడు. అతడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు గోదావరిలో గాలింపు చేపట్టారు. గురువారం నదిలో సమ్మక్క గద్దెల సమీపంలో సురేందర్‌ మృతదేహాన్ని గుర్తించగా పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. 
కేఎస్‌ఎన్‌.శర్మ మృతికి కళాకారుల నివాళి కరీంనగర్‌ సాంస్కృతికం, న్యూస్‌టుడే: తెలుగు రాష్ట్రాల్లో పద్య, సంగీత, సాంఘిక నాటక రంగాలకు ఆరాధ్యుడైన కె.ఎస్‌.ఎన్‌.శర్మ మృతి నాటక రంగానికి తీరని లోటని పలువురు కళాకారులు విచారం వ్యక్తం చేస్తు సంతాపం ప్రకటించారు. కరీంనగర్‌ కృషి భవన్‌లో శర్మ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. చైతన్య కళాభారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ కరీంనగర్‌ చైతన్య కళాభారతి నుంచి ప్రదర్శించిన కె.హరి నాటకానికి ఆయనకు నంది అవార్డు వచ్చిందని గుర్తు చేసుకున్నారు. నంది అవార్డుతో కరీంనగర్‌తో చివరి వరకు సన్నిహిత అనుబంధం పెరిగిందన్నారు. తెలంగాణలో అనేక నాటకాలకు ఆయన సంగీతం అందించారు. మృధు స్వభావి, సాత్వికుడైన కె.ఎస్‌.ఎన్‌.శర్మ మరణం బాధ కల్గించిందని కళాకారులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు. కళాకారులు మంచాల రమేష్‌, కూనమల్ల రమేష్‌, జి.కృపాదానం, ఉదయ్‌కుమార్‌, ప్రభు, కె.సత్యనారాయణ, రాజేందర్‌, హరి, ఆకుల శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు. 
పనిపట్టాల్సిందే.. పక్కన పెట్టాల్సిందే..! ప్లాస్టిక్‌ నిషేధం దిశగా సర్కారు సీఎం నిర్ణయంతో పర్యావరణానికి మేలు జిల్లాలోని పట్టణాల్లో అధ్వాన పరిస్థితి మానవాళికి, జీవకోటికి ముప్పుగా మారుతున్న ప్లాస్టిక్‌ను రాష్ట్రంలో నిషేధించాలి. త్వరలోనే మంత్రివర్గ భేటీలో దీనిపై అవసరమైన విధి విధానాలు ఖరారు చేస్తాం' ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌ జిల్లాలో ప్లాస్టిక్‌ నిషేధం అమలు ఇక పక్కాగా జరిగేలా అడుగులు పడనున్నాయి. ఇన్నాళ్లూ అమలు విషయంలో ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అనేలా పురపాలికల్లో పరిస్థితి కనిపించింది. ఇటీవల గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంతో యంత్రాంగం కంకణబద్ధులు కావడంతోపాటు ప్రజల్లో అవగాహనను పెంచే పలు కార్యక్రమాలు ఆచరణలో కనిపించాయి. దీనికి తోడుగా తాజాగా ముఖ్యమంత్రి ప్లాస్టిక్‌ విషయంలో నిషేధాన్ని పక్కాగా అమలు చేయాలనే ఆదేశాల్ని పాలనాధికారులకు జారీ చేయడంతో ఈ దిశగా ఆశలు చిగురిస్తున్నాయి. ఏడేళ్ల కిందట కేంద్ర కాలుష్య నివారణ మండలితోపాటు అత్యున్నత న్యాయస్థానం ప్లాస్టిక్‌ భూతం పనిపట్టాలని ఆదేశించినా అది
ఖాళీ అవుతున్న పట్టణ ప్రణాళిక డిప్యుటేషన్లపై బదిలీ చేసుకుంటున్న అధికారులు నగరపాలికలో అధికారులు, ఉద్యోగుల కొరత తీవ్రమైంది..ఉన్న ఉద్యోగులు సైతం పని భారం, ఒత్తిళ్లు భరించలేక సెలవుల్లో వెళ్తుండడంతో పని చేసే వారిపై భారం పెరిగిపోయింది. రోజురోజుకు కొత్త కొత్త ప్రణాళికలు అమలవుతుండటంతో ఉన్న ఉద్యోగులు, అధికారులు ఆ పనులు సకాలంలో చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. న్యూస్‌టుడే, కార్పొరేషన్‌(కరీంనగర్‌) కరీంనగర్‌ నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇంజినీరింగ్‌, పట్టణ ప్రణాళిక, రెవిన్యూ, పారిశుద్ధ్య విభాగం, పరిపాలన విభాగం కీలకమైనవి. ఆయా విభాగాల అధికారులు, ఉద్యోగులు రోజూ ప్రజలకు సంబంధించిన అనుమతులు, ఫిర్యాదులు, సమస్యలు, అభివృద్ధి పనులు వంటివి చేపడతారు. ఇదంతా నిత్యం జరిగే ప్రక్రియే అయినప్పటికీ.. అందులో పని చేసే ఉద్యోగులు, అధికారుల సంఖ్య తగ్గిపోతోంది. పని చేసే ఉద్యోగుల కొరత ఏర్పడటంతో ఉన్న ఉద్యోగులకు, అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగిస్తుండటంతో సమస్యలు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఉద్యోగులే కీలకం ఇంజినీరింగ్‌, పట్టణ ప్రణాళిక, రెవిన్యూ, పారిశుద
'భగీరథ' యత్నం నవతెలంగాణ - కరీంనగర్‌ ప్రతినిధి 'వచ్చే ఎన్నికల నాటికి ఇంటింటికి నల్లా నీరు ఇస్తాం. లేని పక్షంలో ఓట్లు అడగబోం. అంటూ 2014 ఎన్నికల్లో ఇచ్చిన కేసీఆర్‌ హామీ ఇప్పటికీ నెరవేరలేదు. దీంతో ఎప్పటికీ నల్లా నీరు అందుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ నిర్మాణాలు సాగుతూనే ఉన్నాయి. ఇంటింటికీ నల్లా ఎప్పుడు వస్తుందా అని ప్రజలు ఎదురుచూస్తునే ఉన్నారు. పలుమార్లు డెడ్‌లైన్‌లు ప్రకటించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. అందువల్ల ఈ ప్రాజెక్టు పూర్తయ్యేందుకు మరెంత సమయం తీసుకుంటుందో ప్రభుత్వాధినేతలే సెలవివ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు చేపట్టింది. అందులో మిషన్‌ భగీరథను ప్రతిష్టాత్మకంగా తీసు కుంది. వచ్చే ఎన్నికల నాటికి ఇంటింటికీ నల్లా ఇవ్వని పక్షంలో ఓట్లు అడగబోమన్న అంశం అటకె క్కింది. గత డిసెంబర్‌లో జరిగిన ముందుస్తు ఎన్ని కల సందర్బంగా మిషన్‌ భగీరథ మరోమారు తెరపె ైకి వచ్చింది. మందస్తు ఎన్నికల రావడంతో ఆ సమ యానికి ఇంటింటికీ నల్లా ఇవ్వలేకపోయామని నాయకులు చెబుతున్నారు. అంతకు ముందు నుంచే ఎప్పటికప్పడు డెడ్‌
అన్నదాతకు సహకార బ్యాంకుల పెద్దపీట రాష్ట్ర సహకార బ్యాంకు ఛైర్మన్‌ రవీందర్‌రావు ఎలిగేడు(జూలపల్లి), న్యూస్‌టుడే: ఎలాంటి లాభాపేక్ష లేకుండా రైతుల శ్రేయస్సుకు సహకార బ్యాంకులు సేవలందిస్తున్నాయని రాష్ట్ర సహకార బ్యాంకు ఛైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు పేర్కొన్నారు. ఎలిగేడు మండలం ధూళికట్టలో బుధవారం కేడీసీసీ బ్యాంకు బ్రాంచిను ప్రారంభించారు. బ్యాంకు సొంత భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాణిజ్య బ్యాంకులకు ధీటుగా మెరుగైన సేవలను సహకార బ్యాంకులు అందిస్తున్నాయన్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని 127 సంఘాల ద్వారా రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులను అందించడంతో పాటు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ధూళికట్టలో 64వ బ్యాంకును ఏర్పాటు చేయగా ఈ ఆర్థిక సంవత్సరంలో 75 బ్యాంకులను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. 2005లో సహకార బ్యాంకులు నష్టాల్లో ఉండగా ప్రస్తుతం రూ.3 వేల కోట్ల లావాదేవీలు ఉన్నాయన్నారు. గ్రామాల్లో మైక్రో ఏటీఎంలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ మండిగ
సకాలంలో వైద్యం అందక గర్భంలోనే శిశువు మృతి కరీంనగర్ మాత శిశు కేంద్రంలో డెలివరీ కోసం గొల్లపెల్లి సౌమ్య ను బంధువులు తీసుకొచ్చారు.. అయితే సకాలంలో వైద్య సేవలు అందకపోవడంతో కడుపలోనే శిశువు మృతి చెందింది.. దీనిపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.. దీనికి అక్కడి సిబ్బంది ఎదురుదాడికి దిగారు.. సీరియస్ గా ఉన్న పేషేంట్ ను ఇక్కడకు ఎందుకు తెచ్చారని ఫైర్ అయ్యారు.. ఇటువంటి కేసులను ప్రైవేట్ హాస్పటల్లోనే చేస్తారంటూ దురుసుగా సమాధానం చెప్పారు..
కాలువలకు భూమి ఇవ్వం - సర్వేయర్‌ను అడ్డుకున్న రైతులు నవతెలంగాణ-కోనరావుపేట మల్కపేట రిజర్వాయర్‌ కాలువలకు భూములు ఇవ్వబోమని రాజన్న సిరిసిల్ల జిల్లా, కోనరావుపేట మండలంలోని మల్కపేట గ్రామస్తులు బుధవారం అధికారులను అడ్డుకు న్నారు. మల్కపేట రిజర్వాయర్‌కు వెళ్లే కాలు వలను సర్వే చేసేందుకు వచ్చిన అధికారులు గ్రామస్తులు అడ్డుకొని మాట్లాడారు. గతంలో మంత్రి కేటీఆర్‌, హరీశ్‌రావు, ఎమ్మెల్యే రమేష్‌బాబులు రిజర్వాయర్‌ పనులను పరిశీలించడానికి వచ్చినపుడు రిజర్వాయర్‌ భూ నిర్వాసితులను ఆదుకుంటామని హామీ ఇచ్చి అమలు చేయలేదన్నారు. భూమి రేటును మరింత పెంచితేనే కాలువలకు భూములు ఇస్తామని డిమాండ్‌ చేశారు. దీంతో అధికా రులు సర్వే చేయకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు.
30 రోజుల ప్రణాళిక స్ఫూర్తి కొనసాగేలా చూడాలి నవతెలంగాణ-సిరిసిల్ల ప్రజా భాగస్వామ్యంతో జిల్లాలో 30 రోజుల గ్రామ ప్రత్యేక ప్రణాళిక స్ఫూర్తి కొనసాగేలా చూడాలని మంత్రి కేటీఆర్‌ అధికారులకు సూచించారు. సిరిసిల్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి కేటీఆర్‌ 30 రోజుల గ్రామ ప్రత్యేక ప్రణాళిక, తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్‌, జేసీ, పంచాయతీ రాజ్‌ అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో 30 రోజుల గ్రామ ప్రత్యేక ప్రణాళిక అమలు తీరు గుర్తించిన పనులు, పూర్తి చేసిన పనులను కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామ ప్రత్యేక ప్రణాళిక నిరంతరం కొనసాగేలా ప్రజలలో వినూత్న మార్గాల ద్వారా చైతన్యం చేసి గ్రామాల్లో పారిశుధ్యం, పచ్చదనం పెంపొందించేలా చూడాలన్నారు. ఎస్‌హెచ్‌జీ మహిళలు, కుల సంఘాల సభ్యులు, యువతను సంఘటితం చేసి స్వచ్ఛత కార్యక్రమాలలో భాగం అయ్యేలా చూడాలన్నారు. అన్ని గ్రామాల్లో డంపింగ్‌ యార్డ్‌లను ఏర్పాటు చేసి వ్యర్థాల నిర్వహణ చేపట్టాలన్నారు. మండల కేంద్రాలలో స్టాకింగ
వామ్మో సర్కార్ 'నౌకరి' - ఉద్యోగం మానేస్తున్న పంచాయతీ కార్యదర్శులు - పని ఒత్తిడి, తక్కువ వేతనాలే కారణమా.. - ఆరు నెలల్లో 34 మంది రాజీనామా నవతెలంగాణ-కమాన్‌పూర్‌ ఎన్నో ఆశలతో ఉద్యోగ బాధ్యతలు తీసుకున్న జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు (జేపీఎస్‌) విధి నిర్వహణలో నెట్టుకు రాలేకపోతున్నారు. పోటీ పరీక్షల్లో ప్రతిభ చాటి..కొలువు కొట్టి భరించలేని ఒత్తిడి నడుమ విధులు నిర్వహించలేక, వచ్చే వేతనం చాలక అవస్థలు పడుతున్నారు. ఆఖరుకు తమ ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్న దయనీయ పరిస్థితి జిల్లాలో నెలకొంది. జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల కోసం ఎంతగానో ఎదురు చూసిన వీరు, ఆ పోస్టుల్లో చేరిన కొద్ది రోజుల్లోనే తమకు ఈ ఉద్యోగం సరిపడదని కొందరు, ఇతర ఉద్యోగాలు రావడంతో మరికొందరు గుడ్‌బై చెప్పారు. ఇలా..ఆరునెలల కాలంలోనే 34మంది జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు తమ ఉద్యోగాలను వీడారు. 2018 అక్టోబర్‌లో ప్రభుత్వ జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాల భర్తీకి పరీక్ష నిర్వహించింది. ప్రతిభ కనబర్చిన వారికి 2019 ఏప్రిల్‌లో నియామక పత్రాలు అందించారు. రాజీన
గుర్తు తెలియని మృతదేహం లభ్యం మాదాపూర్ : గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన బుధవారం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ రవీందర్ తెలిపిన కథనం ప్రకారం.. గంగారంలోని అయ్యంగార్ బేకరీ వద్ద చెట్టు కింద అతిగా మద్యం సేవించి పడుకున్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు, 108కు సమాచారం అందించారు. సంఘటన స్థలికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది చెట్టుకింద ఉన్న వ్యక్తిని పరిశీలించి మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో సిబ్బంది పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు. 
మల్యాలలో వైద్య శిబిరం కాల్వశ్రీరాంపూర్‌ : మండలంలోని మల్యాల గ్రామంలో గురువారం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామంలోని పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. రక్త నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పంపించారు. ఈకార్యక్రమంలో మెడికల్‌ ఆఫీసర్‌ మహేందర్‌కుమార్‌, సర్పంచ్‌ లంక రాజేశ్వరి, మాజీ జడ్పీటీసీ లంక సదయ్య, హెచ్‌ఈఓ జే సుధాకర్‌, పీహెచ్‌ఎన్‌ అమరావతి, ఎస్‌ఎఫ్‌ బేగం, ఏఎన్‌ఎంలు సుధారాణి, సునిత, ఆశాలు స్వరూప, మమత, ఎస్‌టీఎస్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.
మల్యాలలో వైద్య శిబిరం కాల్వశ్రీరాంపూర్‌ : మండలంలోని మల్యాల గ్రామంలో గురువారం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామంలోని పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. రక్త నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పంపించారు. ఈకార్యక్రమంలో మెడికల్‌ ఆఫీసర్‌ మహేందర్‌కుమార్‌, సర్పంచ్‌ లంక రాజేశ్వరి, మాజీ జడ్పీటీసీ లంక సదయ్య, హెచ్‌ఈఓ జే సుధాకర్‌, పీహెచ్‌ఎన్‌ అమరావతి, ఎస్‌ఎఫ్‌ బేగం, ఏఎన్‌ఎంలు సుధారాణి, సునిత, ఆశాలు స్వరూప, మమత, ఎస్‌టీఎస్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.