Skip to main content

30 రోజుల ప్రణాళిక స్ఫూర్తి కొనసాగేలా చూడాలి


    నవతెలంగాణ-సిరిసిల్ల
    ప్రజా భాగస్వామ్యంతో జిల్లాలో 30 రోజుల గ్రామ ప్రత్యేక ప్రణాళిక స్ఫూర్తి కొనసాగేలా చూడాలని మంత్రి కేటీఆర్‌ అధికారులకు సూచించారు. సిరిసిల్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి కేటీఆర్‌ 30 రోజుల గ్రామ ప్రత్యేక ప్రణాళిక, తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్‌, జేసీ, పంచాయతీ రాజ్‌ అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో 30 రోజుల గ్రామ ప్రత్యేక ప్రణాళిక అమలు తీరు గుర్తించిన పనులు, పూర్తి చేసిన పనులను కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామ ప్రత్యేక ప్రణాళిక నిరంతరం కొనసాగేలా ప్రజలలో వినూత్న మార్గాల ద్వారా చైతన్యం చేసి గ్రామాల్లో పారిశుధ్యం, పచ్చదనం పెంపొందించేలా చూడాలన్నారు.
    ఎస్‌హెచ్‌జీ మహిళలు, కుల సంఘాల సభ్యులు, యువతను సంఘటితం చేసి స్వచ్ఛత కార్యక్రమాలలో భాగం అయ్యేలా చూడాలన్నారు. అన్ని గ్రామాల్లో డంపింగ్‌ యార్డ్‌లను ఏర్పాటు చేసి వ్యర్థాల నిర్వహణ చేపట్టాలన్నారు. మండల కేంద్రాలలో స్టాకింగ్‌ పాయింట్‌ను ఏర్పాటు చేసి వ్యర్థాల విభజన, డిస్పోసల్‌ సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. చెత్తను సేకరించి డంపింగ్‌ యార్డ్‌, మండల స్టాక్‌ పాయింట్‌లకు తరలించేందుకు జిల్లాలో ఎన్ని పుష్‌ లాట్‌, ట్రై సైకిల్‌, బాటరీ ఆపరేటర్‌ వాహనం, ట్రాక్టర్‌లు అవసరం అవుతాయో వివరాలు సేకరించి తనకు సమర్పించాలని పంచాయతీ రాజ్‌ అధికారులు ఆదేశించారు.
    జిల్లాలో ప్రణాళిక వియవంతంపై కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. దీని కోసం కృషి చేసిన జిల్లా యంత్రాంగం, సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, పంచాయతీకార్మికులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. 1200 మంది క్షేత్ర పంచాయతీ కార్మికులు, సిబ్బందికి సంవత్సరం బీమా ప్రీమియం రూ.4 లక్షలను తన డబ్బులతో మంత్రి చెల్లించారు. సంబంధిత బీమా బాండ్‌లను కార్మికులకు అందించాలని కలెక్టర్‌కు సూచించారు. ఇంకుడు గుంతలకు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలన్నారు. మానేరు నదీ తీరం ఎగువ మానేరు నుండి మధ్య మానేరు వరకు నదికి ఇరువైపులా మొక్కలు నాటాలన్నారు. మిషన్‌ భగీరథ పనులు 99శాతం పూర్తయినందున శుద్ధమైన భగీరథ తాగునీరు తాగేలా ప్రజలకు చైతన్యం చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, జేసీ యాస్మిన్‌బాషా, జెడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, జెడ్పీ సీఈవో గౌతంరెడ్డి, డీఆర్‌డీవో రవీందర్‌, డీపీవో రవీందర్‌, డీటీవో కొండల్‌రావు, డీఆర్‌డీవో రవీందర్‌, అధికారులు పాల్గొన్నారు.

    Comments

    Popular posts from this blog

    మల్యాలలో వైద్య శిబిరం కాల్వశ్రీరాంపూర్‌ : మండలంలోని మల్యాల గ్రామంలో గురువారం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామంలోని పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. రక్త నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పంపించారు. ఈకార్యక్రమంలో మెడికల్‌ ఆఫీసర్‌ మహేందర్‌కుమార్‌, సర్పంచ్‌ లంక రాజేశ్వరి, మాజీ జడ్పీటీసీ లంక సదయ్య, హెచ్‌ఈఓ జే సుధాకర్‌, పీహెచ్‌ఎన్‌ అమరావతి, ఎస్‌ఎఫ్‌ బేగం, ఏఎన్‌ఎంలు సుధారాణి, సునిత, ఆశాలు స్వరూప, మమత, ఎస్‌టీఎస్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.
    మల్యాలలో వైద్య శిబిరం కాల్వశ్రీరాంపూర్‌ : మండలంలోని మల్యాల గ్రామంలో గురువారం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామంలోని పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. రక్త నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పంపించారు. ఈకార్యక్రమంలో మెడికల్‌ ఆఫీసర్‌ మహేందర్‌కుమార్‌, సర్పంచ్‌ లంక రాజేశ్వరి, మాజీ జడ్పీటీసీ లంక సదయ్య, హెచ్‌ఈఓ జే సుధాకర్‌, పీహెచ్‌ఎన్‌ అమరావతి, ఎస్‌ఎఫ్‌ బేగం, ఏఎన్‌ఎంలు సుధారాణి, సునిత, ఆశాలు స్వరూప, మమత, ఎస్‌టీఎస్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.
    కేఎస్‌ఎన్‌.శర్మ మృతికి కళాకారుల నివాళి కరీంనగర్‌ సాంస్కృతికం, న్యూస్‌టుడే: తెలుగు రాష్ట్రాల్లో పద్య, సంగీత, సాంఘిక నాటక రంగాలకు ఆరాధ్యుడైన కె.ఎస్‌.ఎన్‌.శర్మ మృతి నాటక రంగానికి తీరని లోటని పలువురు కళాకారులు విచారం వ్యక్తం చేస్తు సంతాపం ప్రకటించారు. కరీంనగర్‌ కృషి భవన్‌లో శర్మ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. చైతన్య కళాభారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ కరీంనగర్‌ చైతన్య కళాభారతి నుంచి ప్రదర్శించిన కె.హరి నాటకానికి ఆయనకు నంది అవార్డు వచ్చిందని గుర్తు చేసుకున్నారు. నంది అవార్డుతో కరీంనగర్‌తో చివరి వరకు సన్నిహిత అనుబంధం పెరిగిందన్నారు. తెలంగాణలో అనేక నాటకాలకు ఆయన సంగీతం అందించారు. మృధు స్వభావి, సాత్వికుడైన కె.ఎస్‌.ఎన్‌.శర్మ మరణం బాధ కల్గించిందని కళాకారులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు. కళాకారులు మంచాల రమేష్‌, కూనమల్ల రమేష్‌, జి.కృపాదానం, ఉదయ్‌కుమార్‌, ప్రభు, కె.సత్యనారాయణ, రాజేందర్‌, హరి, ఆకుల శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.