Skip to main content

4.15 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం

    సంయుక్త పాలనాధికారిణి వనజాదేవి
    పెద్దపల్లి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లాలో వరి ధాన్యం సేకరణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని సంయుక్త పాలనాధికారిణి వనజాదేవి పేర్కొన్నారు. ఈ ఏడాది 4.15 లక్షల మెట్రిక్‌ టన్నుల లక్ష్యంగా నిర్ణయించినట్లు వెల్లడించారు. వానాకాలంలో వరి ధాన్యం సేకరణపై పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ అకున్‌ సబర్వాల్‌ నిర్వహించిన దూరదృశ్య మాధ్యమంలో పాల్గొన్నారు. అనంతరం సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 45 మంది వ్యవసాయ విస్తరణ అధికారులను క్లస్టర్లుగా విభజించి నియమించామన్నారు. రైతులకు మద్దతు ధర చెల్లించేందుకు కొనుగోలు కేంద్రాలు నెలకొల్పుతున్నామని తెలిపారు.
    కోతలు ప్రారంభం నుంచే కేంద్రాలను ప్రారంభించాలన్నారు. సహకార, ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ ప్రవీణ్‌, పౌరసరఫరాలశాఖ అధికారి వెంకటేశ్‌ పాల్గొన్నారు. 

    Comments

    Popular posts from this blog

    మల్యాలలో వైద్య శిబిరం కాల్వశ్రీరాంపూర్‌ : మండలంలోని మల్యాల గ్రామంలో గురువారం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామంలోని పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. రక్త నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పంపించారు. ఈకార్యక్రమంలో మెడికల్‌ ఆఫీసర్‌ మహేందర్‌కుమార్‌, సర్పంచ్‌ లంక రాజేశ్వరి, మాజీ జడ్పీటీసీ లంక సదయ్య, హెచ్‌ఈఓ జే సుధాకర్‌, పీహెచ్‌ఎన్‌ అమరావతి, ఎస్‌ఎఫ్‌ బేగం, ఏఎన్‌ఎంలు సుధారాణి, సునిత, ఆశాలు స్వరూప, మమత, ఎస్‌టీఎస్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

    కేఎస్‌ఎన్‌.శర్మ మృతికి కళాకారుల నివాళి కరీంనగర్‌ సాంస్కృతికం, న్యూస్‌టుడే: తెలుగు రాష్ట్రాల్లో పద్య, సంగీత, సాంఘిక నాటక రంగాలకు ఆరాధ్యుడైన కె.ఎస్‌.ఎన్‌.శర్మ మృతి నాటక రంగానికి తీరని లోటని పలువురు కళాకారులు విచారం వ్యక్తం చేస్తు సంతాపం ప్రకటించారు. కరీంనగర్‌ కృషి భవన్‌లో శర్మ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. చైతన్య కళాభారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ కరీంనగర్‌ చైతన్య కళాభారతి నుంచి ప్రదర్శించిన కె.హరి నాటకానికి ఆయనకు నంది అవార్డు వచ్చిందని గుర్తు చేసుకున్నారు. నంది అవార్డుతో కరీంనగర్‌తో చివరి వరకు సన్నిహిత అనుబంధం పెరిగిందన్నారు. తెలంగాణలో అనేక నాటకాలకు ఆయన సంగీతం అందించారు. మృధు స్వభావి, సాత్వికుడైన కె.ఎస్‌.ఎన్‌.శర్మ మరణం బాధ కల్గించిందని కళాకారులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు. కళాకారులు మంచాల రమేష్‌, కూనమల్ల రమేష్‌, జి.కృపాదానం, ఉదయ్‌కుమార్‌, ప్రభు, కె.సత్యనారాయణ, రాజేందర్‌, హరి, ఆకుల శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.