Skip to main content

'భగీరథ' యత్నం


    నవతెలంగాణ - కరీంనగర్‌ ప్రతినిధి
    'వచ్చే ఎన్నికల నాటికి ఇంటింటికి నల్లా నీరు ఇస్తాం. లేని పక్షంలో ఓట్లు అడగబోం. అంటూ 2014 ఎన్నికల్లో ఇచ్చిన కేసీఆర్‌ హామీ ఇప్పటికీ నెరవేరలేదు. దీంతో ఎప్పటికీ నల్లా నీరు అందుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ నిర్మాణాలు సాగుతూనే ఉన్నాయి. ఇంటింటికీ నల్లా ఎప్పుడు వస్తుందా అని ప్రజలు ఎదురుచూస్తునే ఉన్నారు. పలుమార్లు డెడ్‌లైన్‌లు ప్రకటించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. అందువల్ల ఈ ప్రాజెక్టు పూర్తయ్యేందుకు మరెంత సమయం తీసుకుంటుందో ప్రభుత్వాధినేతలే సెలవివ్వాలి.
    రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు చేపట్టింది. అందులో మిషన్‌ భగీరథను ప్రతిష్టాత్మకంగా తీసు కుంది.
    వచ్చే ఎన్నికల నాటికి ఇంటింటికీ నల్లా ఇవ్వని పక్షంలో ఓట్లు అడగబోమన్న అంశం అటకె క్కింది. గత డిసెంబర్‌లో జరిగిన ముందుస్తు ఎన్ని కల సందర్బంగా మిషన్‌ భగీరథ మరోమారు తెరపె ైకి వచ్చింది. మందస్తు ఎన్నికల రావడంతో ఆ సమ యానికి ఇంటింటికీ నల్లా ఇవ్వలేకపోయామని నాయకులు చెబుతున్నారు. అంతకు ముందు నుంచే ఎప్పటికప్పడు డెడ్‌లైన్‌ విధిస్తూనే ప్రతి నెల దాట వేత ధోరణి అవలంబిస్తున్నారు. రాష్ట్ర స్థాయి లో ముఖ్యమంత్రి, జిల్లా స్థాయిలో మంత్రి పలు మార్లు సమీక్షించినప్పటికి ఫలితాలు మాత్రం కని పించడంలేదు. మిషన్‌ భగీరథ కరీంనగర్‌ సర్కిల్‌లో పరిశీలిస్తే కరీంనగర్‌తో పాటు పెద్దపల్లి జిల్లా కూడా ఉంది. కరీంనగర్‌లో 494 నివాస ప్రాంతాలు న్నాయి. అందులో 461 ప్రాంతాలకు మిషన్‌ భగీరథ నీరు చేరుతున్నట్టు అధికారిక సమాచారం.
    అదే రీతిలో 374 ట్యాంకులు నిర్మించాల్సి ఉం డగా ఇంత వరకు 371 పూర్తయ్యియి. పైప్‌లైన్లు 1750 కిలో మీటర్లకు గాను 1747 కిలోమిటర్లు పూర్తి చేశారు. ఇక ఇంటింటికి నల్లా విషయానికి వస్తే లక్షా 74 వేలా 657 నల్లాలు ఇచ్చారు. 20 15లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు ఇంకా నత్తనడకనా సాగుతునే ఉంది. పెద్దపల్లి జిల్లాలో 440 నివాస ప్రాంతాలకు గాను 419 ప్రాంతాలకు బల్క్‌ సరఫరా జరుగుతోంది. 294 ట్యాంకులకు గాను 293 నిర్మించారు. పైప్‌లైన్‌ నిర్మాణం 1879 కిలోమీటర్లకు గాను 1860 కిలోమీటర్లు పూర్తియ్యా యి. లక్షా 47వేలా 973 ఇండ్లకు నల్లాలు బిగించా రు. ఇంతవరకు లెక్కలు సక్రమంగా ఉన్నప్పటికి నీరందించే పనిమాత్రం ప్రారంభించలేదు. పలుచోట్ల ఈ వెలితి వెక్కిరిస్తూనే ఉంది. ప్రస్తుత పరిస్థితిల్లో ఈ నెలాఖరు నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేంశించుకున్నారు. అయినప్పటికీ అంతలోగా పూర్తయ్యే వాతావారణం కనిపించడంలేదు. ఈ ఏడాది ఆఖరు నాటికైనా పూర్తవుతుందోలేదో వేచి చూడాల్సిందే.

    Comments

    Popular posts from this blog

    మల్యాలలో వైద్య శిబిరం కాల్వశ్రీరాంపూర్‌ : మండలంలోని మల్యాల గ్రామంలో గురువారం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామంలోని పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. రక్త నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పంపించారు. ఈకార్యక్రమంలో మెడికల్‌ ఆఫీసర్‌ మహేందర్‌కుమార్‌, సర్పంచ్‌ లంక రాజేశ్వరి, మాజీ జడ్పీటీసీ లంక సదయ్య, హెచ్‌ఈఓ జే సుధాకర్‌, పీహెచ్‌ఎన్‌ అమరావతి, ఎస్‌ఎఫ్‌ బేగం, ఏఎన్‌ఎంలు సుధారాణి, సునిత, ఆశాలు స్వరూప, మమత, ఎస్‌టీఎస్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.
    మల్యాలలో వైద్య శిబిరం కాల్వశ్రీరాంపూర్‌ : మండలంలోని మల్యాల గ్రామంలో గురువారం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామంలోని పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. రక్త నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పంపించారు. ఈకార్యక్రమంలో మెడికల్‌ ఆఫీసర్‌ మహేందర్‌కుమార్‌, సర్పంచ్‌ లంక రాజేశ్వరి, మాజీ జడ్పీటీసీ లంక సదయ్య, హెచ్‌ఈఓ జే సుధాకర్‌, పీహెచ్‌ఎన్‌ అమరావతి, ఎస్‌ఎఫ్‌ బేగం, ఏఎన్‌ఎంలు సుధారాణి, సునిత, ఆశాలు స్వరూప, మమత, ఎస్‌టీఎస్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.
    కేఎస్‌ఎన్‌.శర్మ మృతికి కళాకారుల నివాళి కరీంనగర్‌ సాంస్కృతికం, న్యూస్‌టుడే: తెలుగు రాష్ట్రాల్లో పద్య, సంగీత, సాంఘిక నాటక రంగాలకు ఆరాధ్యుడైన కె.ఎస్‌.ఎన్‌.శర్మ మృతి నాటక రంగానికి తీరని లోటని పలువురు కళాకారులు విచారం వ్యక్తం చేస్తు సంతాపం ప్రకటించారు. కరీంనగర్‌ కృషి భవన్‌లో శర్మ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. చైతన్య కళాభారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ కరీంనగర్‌ చైతన్య కళాభారతి నుంచి ప్రదర్శించిన కె.హరి నాటకానికి ఆయనకు నంది అవార్డు వచ్చిందని గుర్తు చేసుకున్నారు. నంది అవార్డుతో కరీంనగర్‌తో చివరి వరకు సన్నిహిత అనుబంధం పెరిగిందన్నారు. తెలంగాణలో అనేక నాటకాలకు ఆయన సంగీతం అందించారు. మృధు స్వభావి, సాత్వికుడైన కె.ఎస్‌.ఎన్‌.శర్మ మరణం బాధ కల్గించిందని కళాకారులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు. కళాకారులు మంచాల రమేష్‌, కూనమల్ల రమేష్‌, జి.కృపాదానం, ఉదయ్‌కుమార్‌, ప్రభు, కె.సత్యనారాయణ, రాజేందర్‌, హరి, ఆకుల శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.