Skip to main content

పనిపట్టాల్సిందే.. పక్కన పెట్టాల్సిందే..!


    ప్లాస్టిక్‌ నిషేధం దిశగా సర్కారు
    సీఎం నిర్ణయంతో పర్యావరణానికి మేలు
    జిల్లాలోని పట్టణాల్లో అధ్వాన పరిస్థితి
    మానవాళికి, జీవకోటికి ముప్పుగా మారుతున్న ప్లాస్టిక్‌ను రాష్ట్రంలో నిషేధించాలి. త్వరలోనే మంత్రివర్గ భేటీలో దీనిపై అవసరమైన విధి విధానాలు ఖరారు చేస్తాం'
    ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌
    జిల్లాలో ప్లాస్టిక్‌ నిషేధం అమలు ఇక పక్కాగా జరిగేలా అడుగులు పడనున్నాయి. ఇన్నాళ్లూ అమలు విషయంలో ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అనేలా పురపాలికల్లో పరిస్థితి కనిపించింది.
    ఇటీవల గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంతో యంత్రాంగం కంకణబద్ధులు కావడంతోపాటు ప్రజల్లో అవగాహనను పెంచే పలు కార్యక్రమాలు ఆచరణలో కనిపించాయి. దీనికి తోడుగా తాజాగా ముఖ్యమంత్రి ప్లాస్టిక్‌ విషయంలో నిషేధాన్ని పక్కాగా అమలు చేయాలనే ఆదేశాల్ని పాలనాధికారులకు జారీ చేయడంతో ఈ దిశగా ఆశలు చిగురిస్తున్నాయి. ఏడేళ్ల కిందట కేంద్ర కాలుష్య నివారణ మండలితోపాటు అత్యున్నత న్యాయస్థానం ప్లాస్టిక్‌ భూతం పనిపట్టాలని ఆదేశించినా అది కేవలం మాటలకే పరిమితమైంది. కొన్నాళ్లు అధికారులు హడావుడి చేసినా అది ఉత్తుత్తిదేనని తేలిపోయింది.
    పట్టింపెక్కడ..?
    కరీంనగర్‌ జిల్లాలోని నరగపాలక సంస్థతోపాటు హుజురాబాద్‌, జమ్మికుంట పురపాలికలతోపాటు కొత్తగా ఏర్పాటైన కొత్తపల్లి, చొప్పదండి పురపాలికల్లో ప్లాస్టిక్‌పై నియంత్రణ పూర్తిగా కొరవడింది. అధికారులు ఆయా సందర్భాల్లో చేస్తున్న హడావుడి తప్పా పూర్తిస్థాయిలో నిర్మూలనకు అవసరమైన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. నిషేధాన్ని ఉల్లంఘించిన వారినుంచి అపరాధ రుసుమును వసూలు విషయంలోనూ పురపాలిక యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఈ ఐదు పట్టణాల పరిధిలో నిత్యం 2.10 మెట్రిక్‌ టన్నుల చెత్త వెలువడుతోంది. ఇందులో ప్లాస్టిక్‌ వ్యర్థాల పాపమే 30 శాతం వరకుంటుంది. కరీంనగర్‌ డంప్‌యార్డులో అత్యధికంగా భూమిలో కరగని కవర్లే అధికంగా ఉన్నాయి. గడిచిన ఏడాది కాలంగా అన్ని పట్టణాల్లో కలిపి కేవలం రూ.1.30లక్షలు మాత్రమే వ్యాపారులకు, విక్రయదారులకు జరిమానా విధించారంటే పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థమవుతోంది. జమ్మికుంట పురపాలికలో ప్లాస్టిక్‌ కవర్లు వాడుతున్న వారికి రూ.10వేలు జరిమానా విధంచారు. హుజురాబాద్‌లో మొత్తంగా 19 కేసుల్ని నమోదు చేసి వారి నుంచి కేవలం రూ.36వేలు వసూలు చేశారు. ఇక చొప్పదండిలో ఒక్క రోజు రూ.3200 వసూలు చేసి చేతులు దులిపేసుకున్నారు. ఒక్క కరీంనగర్‌లోనే రూ.87వేల వరకు అపరాధ రుసుముల రూపేణా నగరపాలక అధికారులు చర్యలు తీసుకున్నామని చెబుతున్నా.. ఇక్కడి వాడకం, వినియోగం, విక్రయాల విషయంలో మాత్రం ఇది కొండను తవ్వి ఎలుకను పట్టిన చందమేనని చెప్పక తప్పదు.
    పనిపడితేనే మేలు..
    ప్రజాచైతన్యం, అధికారుల చొరవతో ముడి పడి ఉన్న ఈ వ్యవహారంపై ఇక మీదటనైనా కఠినమైన చర్యల రూపంలో అడుగులు పడాల్సిన అవసరముంది. పట్టణాలతోపాటు పల్లెల్లోనూ ప్లాస్టిక్‌ భూతం ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతోంది. నామమాత్రంగా చిరువ్యాపారుల వద్ద కట్టడి చేయడం కన్నా.. అసలు మూలాలున్న వ్యాపారుల వద్ద దాగి ఉన్న క్వింటాళ్ల కొద్ది ప్లాస్టిక్‌ను స్వాధీనపర్చుకునే దిశగా అధికారులు అడుగులు వేయాలి. ఇన్నాళ్లు పెద్ద వ్యాపారుల జోలికి వెళ్లలేకపోయారన్నది ప్రధానంగా పట్టణాల్లో వినిపిస్తున్న ఆరోపణ. గతంలో మాధిరిగా ఈ వ్యవహారాన్ని ముణ్ణాళ్ల ముచ్చటగా మారొద్దూ.! 40 మైక్రాన్ల కన్న ఎక్కడ పడితే అక్కడ కవర్లు కనిపిస్తున్నాయి. కొన్ని స్వచ్ఛంద సంస్థలు సహా పలు సంఘాలు నివారణ దిశగా చైతన్యాన్ని కల్పిస్తున్నాయి. ఇక పాలనాధికారుల పర్యవేక్షణ మరింతగా పెరిగితే ఎక్కడికక్కడే ఈ ఇబ్బందిని అధిగమించే అవకాశం ఉంది. ప్రధానంగా కరీంనగర్‌లాంటి పట్టణాల్లో ఈ ప్రక్రియ దిశగా యంత్రాంగం పూర్తిస్థాయి కసరత్తును షురూ చేయాలి. ఫంక్షన్‌హాళ్లతోపాటు హొటళ్లు, ఇతరత్రా వ్యాపార సముదాయాల్లో పక్కాగా నియంత్రిస్తే ఇది పెద్ద కష్టమేమి కాదు. ఇదే సమయంలో కేవలం ప్రజల్లోనే మార్పు రావాలనేలా ఊరుకుంటే అసలుకే ఎసరొచ్చే ప్రమాదముంది. ఓ వైపు యంత్రాంగం కఠిన నిర్ణయాల్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తూ ప్రజల్లో అవగాహనను పెంచాలి. 

    Comments

    Popular posts from this blog

    మల్యాలలో వైద్య శిబిరం కాల్వశ్రీరాంపూర్‌ : మండలంలోని మల్యాల గ్రామంలో గురువారం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామంలోని పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. రక్త నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పంపించారు. ఈకార్యక్రమంలో మెడికల్‌ ఆఫీసర్‌ మహేందర్‌కుమార్‌, సర్పంచ్‌ లంక రాజేశ్వరి, మాజీ జడ్పీటీసీ లంక సదయ్య, హెచ్‌ఈఓ జే సుధాకర్‌, పీహెచ్‌ఎన్‌ అమరావతి, ఎస్‌ఎఫ్‌ బేగం, ఏఎన్‌ఎంలు సుధారాణి, సునిత, ఆశాలు స్వరూప, మమత, ఎస్‌టీఎస్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.
    మల్యాలలో వైద్య శిబిరం కాల్వశ్రీరాంపూర్‌ : మండలంలోని మల్యాల గ్రామంలో గురువారం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామంలోని పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. రక్త నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పంపించారు. ఈకార్యక్రమంలో మెడికల్‌ ఆఫీసర్‌ మహేందర్‌కుమార్‌, సర్పంచ్‌ లంక రాజేశ్వరి, మాజీ జడ్పీటీసీ లంక సదయ్య, హెచ్‌ఈఓ జే సుధాకర్‌, పీహెచ్‌ఎన్‌ అమరావతి, ఎస్‌ఎఫ్‌ బేగం, ఏఎన్‌ఎంలు సుధారాణి, సునిత, ఆశాలు స్వరూప, మమత, ఎస్‌టీఎస్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.
    కేఎస్‌ఎన్‌.శర్మ మృతికి కళాకారుల నివాళి కరీంనగర్‌ సాంస్కృతికం, న్యూస్‌టుడే: తెలుగు రాష్ట్రాల్లో పద్య, సంగీత, సాంఘిక నాటక రంగాలకు ఆరాధ్యుడైన కె.ఎస్‌.ఎన్‌.శర్మ మృతి నాటక రంగానికి తీరని లోటని పలువురు కళాకారులు విచారం వ్యక్తం చేస్తు సంతాపం ప్రకటించారు. కరీంనగర్‌ కృషి భవన్‌లో శర్మ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. చైతన్య కళాభారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ కరీంనగర్‌ చైతన్య కళాభారతి నుంచి ప్రదర్శించిన కె.హరి నాటకానికి ఆయనకు నంది అవార్డు వచ్చిందని గుర్తు చేసుకున్నారు. నంది అవార్డుతో కరీంనగర్‌తో చివరి వరకు సన్నిహిత అనుబంధం పెరిగిందన్నారు. తెలంగాణలో అనేక నాటకాలకు ఆయన సంగీతం అందించారు. మృధు స్వభావి, సాత్వికుడైన కె.ఎస్‌.ఎన్‌.శర్మ మరణం బాధ కల్గించిందని కళాకారులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు. కళాకారులు మంచాల రమేష్‌, కూనమల్ల రమేష్‌, జి.కృపాదానం, ఉదయ్‌కుమార్‌, ప్రభు, కె.సత్యనారాయణ, రాజేందర్‌, హరి, ఆకుల శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.