Skip to main content

అన్నదాతకు సహకార బ్యాంకుల పెద్దపీట

    రాష్ట్ర సహకార బ్యాంకు ఛైర్మన్‌ రవీందర్‌రావు
    ఎలిగేడు(జూలపల్లి), న్యూస్‌టుడే: ఎలాంటి లాభాపేక్ష లేకుండా రైతుల శ్రేయస్సుకు సహకార బ్యాంకులు సేవలందిస్తున్నాయని రాష్ట్ర సహకార బ్యాంకు ఛైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు పేర్కొన్నారు. ఎలిగేడు మండలం ధూళికట్టలో బుధవారం కేడీసీసీ బ్యాంకు బ్రాంచిను ప్రారంభించారు. బ్యాంకు సొంత భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాణిజ్య బ్యాంకులకు ధీటుగా మెరుగైన సేవలను సహకార బ్యాంకులు అందిస్తున్నాయన్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని 127 సంఘాల ద్వారా రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులను అందించడంతో పాటు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
    ధూళికట్టలో 64వ బ్యాంకును ఏర్పాటు చేయగా ఈ ఆర్థిక సంవత్సరంలో 75 బ్యాంకులను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. 2005లో సహకార బ్యాంకులు నష్టాల్లో ఉండగా ప్రస్తుతం రూ.3 వేల కోట్ల లావాదేవీలు ఉన్నాయన్నారు. గ్రామాల్లో మైక్రో ఏటీఎంలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ మండిగ రేణుక, సర్పంచి గొల్లె కావేరి, ఎంపీటీసీ సభ్యురాలు సావిత్రమ్మ, కేడీసీసీ బ్యాంకు వైస్‌ ఛైర్మన్‌ మోహన్‌రెడ్డి, సీఈవో సత్యనారాయణరావు, డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ సురేందర్‌రెడ్డి, ఛైర్మన్లు గండు సంజీవ్‌, సుధాకర్‌రెడ్డి, అర్జున్‌రావు, మోహన్‌రావు, శ్రీనివాస్‌, జానీ, డైరెక్టరు గోపాల్‌రావు, ఉప సర్పంచి మదుసూదన్‌రావు, ఎలిగేడు, జూలపల్లి మండలాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. 

    Comments

    Popular posts from this blog

    మల్యాలలో వైద్య శిబిరం కాల్వశ్రీరాంపూర్‌ : మండలంలోని మల్యాల గ్రామంలో గురువారం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామంలోని పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. రక్త నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పంపించారు. ఈకార్యక్రమంలో మెడికల్‌ ఆఫీసర్‌ మహేందర్‌కుమార్‌, సర్పంచ్‌ లంక రాజేశ్వరి, మాజీ జడ్పీటీసీ లంక సదయ్య, హెచ్‌ఈఓ జే సుధాకర్‌, పీహెచ్‌ఎన్‌ అమరావతి, ఎస్‌ఎఫ్‌ బేగం, ఏఎన్‌ఎంలు సుధారాణి, సునిత, ఆశాలు స్వరూప, మమత, ఎస్‌టీఎస్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

    కేఎస్‌ఎన్‌.శర్మ మృతికి కళాకారుల నివాళి కరీంనగర్‌ సాంస్కృతికం, న్యూస్‌టుడే: తెలుగు రాష్ట్రాల్లో పద్య, సంగీత, సాంఘిక నాటక రంగాలకు ఆరాధ్యుడైన కె.ఎస్‌.ఎన్‌.శర్మ మృతి నాటక రంగానికి తీరని లోటని పలువురు కళాకారులు విచారం వ్యక్తం చేస్తు సంతాపం ప్రకటించారు. కరీంనగర్‌ కృషి భవన్‌లో శర్మ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. చైతన్య కళాభారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ కరీంనగర్‌ చైతన్య కళాభారతి నుంచి ప్రదర్శించిన కె.హరి నాటకానికి ఆయనకు నంది అవార్డు వచ్చిందని గుర్తు చేసుకున్నారు. నంది అవార్డుతో కరీంనగర్‌తో చివరి వరకు సన్నిహిత అనుబంధం పెరిగిందన్నారు. తెలంగాణలో అనేక నాటకాలకు ఆయన సంగీతం అందించారు. మృధు స్వభావి, సాత్వికుడైన కె.ఎస్‌.ఎన్‌.శర్మ మరణం బాధ కల్గించిందని కళాకారులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు. కళాకారులు మంచాల రమేష్‌, కూనమల్ల రమేష్‌, జి.కృపాదానం, ఉదయ్‌కుమార్‌, ప్రభు, కె.సత్యనారాయణ, రాజేందర్‌, హరి, ఆకుల శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.