Skip to main content

కాలువలకు భూమి ఇవ్వం

    - సర్వేయర్‌ను అడ్డుకున్న రైతులు
    నవతెలంగాణ-కోనరావుపేట
    మల్కపేట రిజర్వాయర్‌ కాలువలకు భూములు ఇవ్వబోమని రాజన్న సిరిసిల్ల జిల్లా, కోనరావుపేట మండలంలోని మల్కపేట గ్రామస్తులు బుధవారం అధికారులను అడ్డుకు న్నారు. మల్కపేట రిజర్వాయర్‌కు వెళ్లే కాలు వలను సర్వే చేసేందుకు వచ్చిన అధికారులు గ్రామస్తులు అడ్డుకొని మాట్లాడారు. గతంలో మంత్రి కేటీఆర్‌, హరీశ్‌రావు, ఎమ్మెల్యే రమేష్‌బాబులు రిజర్వాయర్‌ పనులను పరిశీలించడానికి వచ్చినపుడు రిజర్వాయర్‌ భూ నిర్వాసితులను ఆదుకుంటామని హామీ ఇచ్చి అమలు చేయలేదన్నారు. భూమి రేటును మరింత పెంచితేనే కాలువలకు భూములు ఇస్తామని డిమాండ్‌ చేశారు. దీంతో అధికా రులు సర్వే చేయకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు.

    Comments

    Popular posts from this blog

    మల్యాలలో వైద్య శిబిరం కాల్వశ్రీరాంపూర్‌ : మండలంలోని మల్యాల గ్రామంలో గురువారం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామంలోని పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. రక్త నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పంపించారు. ఈకార్యక్రమంలో మెడికల్‌ ఆఫీసర్‌ మహేందర్‌కుమార్‌, సర్పంచ్‌ లంక రాజేశ్వరి, మాజీ జడ్పీటీసీ లంక సదయ్య, హెచ్‌ఈఓ జే సుధాకర్‌, పీహెచ్‌ఎన్‌ అమరావతి, ఎస్‌ఎఫ్‌ బేగం, ఏఎన్‌ఎంలు సుధారాణి, సునిత, ఆశాలు స్వరూప, మమత, ఎస్‌టీఎస్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

    కేఎస్‌ఎన్‌.శర్మ మృతికి కళాకారుల నివాళి కరీంనగర్‌ సాంస్కృతికం, న్యూస్‌టుడే: తెలుగు రాష్ట్రాల్లో పద్య, సంగీత, సాంఘిక నాటక రంగాలకు ఆరాధ్యుడైన కె.ఎస్‌.ఎన్‌.శర్మ మృతి నాటక రంగానికి తీరని లోటని పలువురు కళాకారులు విచారం వ్యక్తం చేస్తు సంతాపం ప్రకటించారు. కరీంనగర్‌ కృషి భవన్‌లో శర్మ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. చైతన్య కళాభారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ కరీంనగర్‌ చైతన్య కళాభారతి నుంచి ప్రదర్శించిన కె.హరి నాటకానికి ఆయనకు నంది అవార్డు వచ్చిందని గుర్తు చేసుకున్నారు. నంది అవార్డుతో కరీంనగర్‌తో చివరి వరకు సన్నిహిత అనుబంధం పెరిగిందన్నారు. తెలంగాణలో అనేక నాటకాలకు ఆయన సంగీతం అందించారు. మృధు స్వభావి, సాత్వికుడైన కె.ఎస్‌.ఎన్‌.శర్మ మరణం బాధ కల్గించిందని కళాకారులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు. కళాకారులు మంచాల రమేష్‌, కూనమల్ల రమేష్‌, జి.కృపాదానం, ఉదయ్‌కుమార్‌, ప్రభు, కె.సత్యనారాయణ, రాజేందర్‌, హరి, ఆకుల శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.